ఈ సినిమాపై జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అయితే రాజమౌళి ఈ సినిమా విషయంలో చాలా పక్కగానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్గా తీసుకోవడం పట్ల చాలామంది జనాలు మండిపడ్డారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన అలాంటి ఓ ఫిగర్ ఉన్న బ్యూటీ ఏంటి..? అంటూ ఫైర్ అయ్యారు. దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా కాదు అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మాత్రమే చూస్ చేసుకున్నారు అని ఓ న్యూస్ బయటకు వచ్చింది .
దానికోసం కూడా ఆమె కి రక రకాల స్క్రీన్ టెస్ట్ లు చేసి మరి ఓకే చేశారట . దాదాపు మూడు నెలల పాటు ఆమెపై రక రకాల టెస్ట్ లు చేసి స్పెషల్ గా ఆడిషన్స్ కూడా చేయించి ఫైనల్ చేశారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . దీంతో రాజమౌళి ది గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ లాంటి ప్రియాంక చోప్రాకే స్క్రీన్ టెస్ట్ లు ఆడిషన్స్ పెట్టావా..? నువ్వు నిజంగా దేవుడివయ్యా సామి ..అంటూ ఓ రేంజ్ లో రాజమౌళి పని పిచ్చి పై మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమాతో మరొక ఆస్కార్ ఇండియాకి తీసుకురావడం పక్క అంటున్నారు జనాలు..!