మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది . త్వరలోనే ఆఫ్రికా అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది . దానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్నాడు రాజమౌళి . కాగా ఇదే మూమెంట్లో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా బయట ట్రెండ్ అవుతున్నాయి . ఇదే మూమెంట్లో గతంలో మహేష్ బాబుకి ఎదురైనా ఒక చిలిపి ప్రశ్నకు ఆయన ఇచ్చిన స్టన్నింగ్ ఆన్సర్ బాగా ట్రెండ్ అవుతుంది.
ఒకానొక ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నిస్తూ .."మీరు హీరోయిన్స్లలో బాగా నచ్చేది ఏంటి..?" అనే విషయం ప్రశ్నించగా.. మహేష్ బాబు స్టాన్నింగ్ ఆన్సర్ ఇచ్చారు . "తనకి హీరోయిన్ విషయంలోనే కాదు .. ప్రతి ఒక్క అమ్మాయిలోనూ కనిపించగానే స్మైల్ చూస్తాను అని ..స్మైల్ చాలా అట్రాక్టివ్ గా మనల్ని కూల్ చేసేస్తుంది అని .. అందుకే ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చారు". దీంతో మహేష్ బాబు స్టన్నింగ్ ఆన్సర్ కి అక్కడ ఉండేవాళ్లే కాకుండా హోస్ట్ కూడా షాక్ అయిపోయింది . మహేష్ బాబు తనకి ఎదురైన ఎంత టఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ అయిన చాలా చకచగా ఇచ్చేస్తూ సరదాగా ఆ సిచ్యువేషన్ ని మార్చేస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే..!