టాలీవుడ్ లో బడా హీరోలుగా పేరుపొందిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలను వల్ల తాను 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయాను అంటూ తెలియజేశారు. 2011లో గచ్చిబౌలిలో ప్రముఖ వ్యాపారవేత్తనూ బెదిరించి 12 కోట్ల రూపాయలు స్వాహా చేశారంటూ సింగనమల రమేష్ మీద కేసులు నమోదు చేశారట.. ఈ కేసులో 78 రోజుల పాటు జైల్లో ఉన్నారట. అయితే జనవరి 31 న 2025న ఎటువంటి సాక్షాధారాలు లేకపోవడంతో ఈ నిర్మాతను నిర్దోషిగా కోర్టు తెలియజేసిందని అందుకే ఇప్పుడు పైన ప్రెస్ మీట్ పెట్టారట రమేష్ బాబు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా రమేష్ బాబు మాట్లాడుతూ తనమీద అబద్ధపు కేసులు వేయడం జరిగింది.. దీంతో 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసేలా చేశారు. కానీ ఇప్పటికి విజయాన్ని అందుకున్నానని తెలిపారు. అబద్ధపు కేసులు ఎప్పుడూ కూడా నిలబడవని తనను ఈ స్థితికి తీసుకువచ్చిన వాళ్ల మీదే ఇకపైన న్యాయపోరాటం చేస్తానంటూ వెళ్లిపోయారు. కష్ట కాలంలో ఉన్న తనకి ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసి కూడా పరామర్శించలేదని తెలిపారు. అలాగే మాట్లాడుతూ కొమరం పులి, ఖలేజా వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి 100 కోట్ల వరకు నష్టం జరిగిందనీ.. తన నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఏడాదిలోనే పూర్తి అయ్యేవి కానీ దురదృష్టవశాత్తు ఈ రెండు సినిమాలు మూడు మూడేళ్లు పట్టాయని తెలిపారు.