నాగచైతన్య శోభిత దూళిపాళ్లలు ఎప్పుడైతే రెండో పెళ్లి చేసుకున్నారో అప్పటినుండి సమంత గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నందుకు సమంత ఎంతగానో బాధపడిందని,వెక్కివెక్కి ఏడ్చిందని,వీరిద్దరు మూడుముళ్ళ బంధంతో ఒక్కటవ్వడంతోనే సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అంటూ ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న రోజే సమంత తండ్రి కూడా మరణించడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్లింది నిజమే..కానీ అది నాగచైతన్య పెళ్లి చేసుకున్నందుకు కాదు అని అర్థం చేసుకోవాలి.అయితే చాలా రోజుల నుండి నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు కాబట్టి సమంత ఆ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది..

 ఆమె స్పందన ఏంటి అని తెలుసుకోవాలని చాలామందిలో ఉంది. అయితే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్న విషయం. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.నాగచైతన్య భార్య ప్లేస్ లో ఒకప్పుడు సమంత ఉండేది. కానీ విడాకుల తర్వాత నాగచైతన్య భార్య ప్లేస్ లోకి శోభిత ధూళిపాళ్ల ఎంట్రీ ఇచ్చింది.అయితే దీనిపై సమంత స్పందన ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందిలో ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతకు ఈ ప్రశ్న ఎదురైంది.నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు కదా..  మీరు ఎలా ఫీలవుతారు..

మీకేమైనా అసూయ ఉందా అనే ప్రశ్న ఎదురవగా.. నా జీవితంలో అసూయ అనే పదానికి చోటు లేదు..అలాంటి విషయాలు నేను పెద్దగా పట్టించుకోను. అసలు దాని గురించి నాకు అవసరమే లేదు అంటూ నాగచైతన్య రెండో పెళ్లిపై స్పందించింది సమంత. ప్రస్తుతం సమంత మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.ఇక నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు బయటపడ్డాక సమంత కూడా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందని,వాళ్ళిద్దరికీ సంబంధించి ఎన్నో ఫొటోస్ సోషల్ మీడియాలో బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: