2013 సంక్రాంతికి వచ్చి ఘన విజయాలు అందుకున్నారు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో చిరంజీవి.. వాల్తేరు వీరయ్య సినిమా చేసి హిట్ కొడితే.. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ హిట్ కొట్టారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించాయి. మరోసారి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు అదే దర్శకులతో సినిమాలు చేసేందుకు రంగం సిద్ధమయింది. ఈ ఇద్దరు మరోసారి తమకు హిట్ ఇచ్చిన దర్శకుల ను రిపీట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఓ వేడుకలో దర్శకుడు గోపీచంద్ మలినేనికి సిగ్నల్ ఇస్తూ.. మరో సినిమాకు సిద్ధం కావాలని బాలయ్య చెప్పారు. బాలకృష్ణకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా ఆయన సోదరి నారా భువనేశ్వరి హైదరాబాదులో ప్రత్యేక వేడుక ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే బాలకృష్ణ వీరసింహారెడ్డి కలయిక ఖరారు అయిందని తెలుస్తోంది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో జాట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ తో సినిమా కోసం రంగంలో కి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కూడా దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. తాజాగా సంక్రాంతి కి బాలకృష్ణ హీరో గా డాకుమహరాజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన బాబి.. తర్వాత చిరంజీవి సినిమా కోసమే కథ రెడీ చేయటంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మరి మరోసారి వీరసింహా రెడ్డి 2 - వాల్తేరు వీరయ్య 2 సినిమా లు త్వరలోనే మనం చూడబోతున్నాం అనుకోవాలి. ఈ రెండు సినిమా లపై త్వరలో నే క్లారిటీ కూడా రానుంది.