![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/tandel700647aa-3b8f-46be-8143-b863d3005d33-415x250.jpg)
నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన పిరియాడికల్ యాక్సిడెంట్ డ్రామా కావడంతో.. ప్రేక్షకులు ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అద్భుతమైన హైప్ క్రియేట్ చేశాయి. నాన్ థియెట్రికల్ రైట్స్ రూపంలో.. ఈ సినిమా భారీ ఆదాయం రాబట్టింది. సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి రూ.35 కోట్లు, ఆడియో రైట్స్ రూపంలో రూ.47 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా రూ.8 కోట్లు, సాటిలైట్ హక్కుల ద్వారా రూ.10 కోట్లు రాబట్టింది.
మొత్తంగా నాన్ థియేట్రికల్ రూ.60 కోట్లకు పైనే జరిగింది. సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.90 కోట్లుగా ఉందని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తండేల్ థియేటర్ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. గీత కాంపౌండ్ సినిమా కావటం.. బన్నీ వాస్ నిర్మిస్తున్న సినిమా కావడంతో మార్కెట్లో సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అందుకే అన్ని ఏరియా ల్లోనూ ఫ్యాన్సీ రేట్ల కే సినిమా అమ్ముడు పోతోంది.
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల హక్కుల రూ.13 కోట్లకు అమ్ముడుపోగా.. తెలంగాణ కలిపి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు బిజినెస్ రూ.27.5 కోట్లుగా అయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల పెంపు కోసం టీం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా ఉండే సినిమా కావడంతో.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా థియేటర్లలో బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.40 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.