టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ మొదటి పార్ట్ కమర్షియల్‌గా బాగానే వర్కౌట్ అయింది. ఈ రేంజ్‌లో ఏ సినిమా రాలేదన్న టాక్ అయితే ఉంది. ప్రభాస్ లాంటి కటౌట్‌కి తగిన సినిమా అయినా.. సలార్ వన్ ఎందుకు కేజీఎఫ్ స్థాయి అంచనాలు అందుకోలేదు. అయితే ప్రశాంత్ నీల్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ సలార్ 2 నెస్ట్ లెవెల్ లో ఉంటుందని వెల్లడించారు. సలార్ కన్నా భారీగా ఈ మూవీ ఉండబోతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రభాస్ .. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు.
ఆ సినిమా తర్వాత హను రాఘవపూడితో ఫౌజి సినిమా ఉంటుంది. ఇక లైన్ లో సందీప్ రెడ్డి సినిమా కూడా ఉంది. ప్రభాస్‌తో కల్కి 2 సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలని ఉందని నిర్మాత అశ్విని దత్ చెప్పాడు. ఎలాగూ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి.. ప్రభాస్ ఈలోగా పై మూడు ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ 2 సినిమా 2026 కూడా కాదు.. 2027 లోనే సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది.
2027లో సెట్స్ మీద సలార్ 2 వెళితే .. 2028 లేదా 2029 లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా సెట్స్ మీద ఉన్న ప్రభాస్ సినిమా చూస్తే .. ఈ ఏడాది రాజాసాబ్ సినిమా ఒక్కటి మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. స్పిరిట్ కన్నా ఫౌజీ సినిమా ఎక్కువ స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది.