ఏంటి నారా బ్రాహ్మిణిని మంచు మనోజ్ కొట్టారా.. వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది...మంచు మనోజ్ బ్రాహ్మిణిపై చేయి ఎందుకు చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు మనోజ్ నారా బ్రాహ్మణి పై చేయి చేసుకున్నది నిజమే. కానీ పెద్దయ్యాక అయితే కాదు.ఎందుకంటే చిన్నతనంలో మంచు మనోజ్ బ్రాహ్మణిపై చేయి చేసుకున్నారట. అయితే చిన్న తనంలో అందరూ కలిసి ఆడుకునే సమయంలో ఓసారి బ్రాహ్మిణిపై చేయి చేసుకున్నారట మనోజ్. ఈ విషయం వసుంధరా దేవికి తెలిసి మనోజ్ ని కాస్త గట్టిగానే మందలించ్చిందట. అయితే ఈ విషయాన్ని బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో బయటపెట్టారు.. బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో లో ఇప్పటికే ఎంతోమంది గెస్ట్ లుగా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో ఈ షో కి మోహన్ బాబు,విష్ణు,లక్ష్మీలు గెస్ట్లుగా వచ్చారు.

ఆ టైంలో ఎన్నో విషయాలు నెమరు వేసుకున్నారు. ఇందులో భాగంగా చిన్నతనంలో మనోజ్ బ్రాహ్మణిని కొట్టినట్లు నా భార్య నాకు కంప్లైంట్ చేసిందని, అలాగే బ్రాహ్మణి కూడా నా దగ్గరికి వచ్చి మనోజ్ నన్ను కొట్టాడు నాన్న అని చెప్పింది అంటూ బాలకృష్ణ గుర్తు చేశారు. ఇక  ఆ సమయంలో మనోజ్ కి వసుంధర దేవి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అంటూ మంచు విష్ణు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు. అలాగే చిన్నతనంలో బాలకృష్ణ గారు మాకు ఎన్నో బొమ్మలు కొనిచ్చేవారని, మా నాన్నకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా మా ఫ్యామిలీకి బాలకృష్ణ గారు అండగా ఉన్నారంటూ చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు మంచు లక్ష్మి, విష్ణు..

 అయితే ప్రస్తుతం అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీకి బాలకృష్ణ ఫ్యామిలీ కి మధ్య అంత మంచి బాండింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి చెప్పనవసరం లేదు.మినట్ టూ మినిట్ వీరికి సంబంధించి ఏ చిన్న గొడవ జరిగినా కూడా మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: