నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా నటించిన డాకుమహారాజ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఈ నూతన సంవత్సరం బాలయ్య కు బాగా కలిసోచ్చిందనే చెప్పాలి.ఎందుకంటే బాలయ్య సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా బాలయ్య కు పద్మభూషణ్ అవార్డు వరించింది.ఇదిలావుండగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సినిమాల ఛాయిస్, వ్యక్తిత్వం గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ ఎంతో ఎత్తులో ఉన్నా ఆయన ఒదిగే ఉంటారు. పైకి యాంగ్రీగా కనిపించే బాలయ్య తన బంధు మిత్రుల ముందు బాలకృష్ణుడిగా మారిపోతుంటారు. ఇటీవల ఆయన సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వరించిన నేపథ్యంలో హైదరాబాద్ శివార్లలోని చంద్రబాబు ఫార్మ్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పార్టీలో పాల్గొన్న ఒక్కొక్కరి చేత బాలకృష్ణ మీద అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో స్టేజ్ ఎక్కిన బాలయ్య పెద్ద కుమార్తె.. నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు నాన్నని నేను, తేజు(సోదరి) ఇద్దరు అపార్థం చేసుకున్నాం. ఆయన ఎప్పుడూ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడారు లోపల ఏది అనిపిస్తే అది బయటికి అనేస్తారు. అలా అనే నేపథ్యంలో కొన్నిసార్లు నాన్న ఏంటి ఇలా అంటున్నాడు అని తప్పుగా అర్థం చేసుకునేవాళ్లం. కానీ ఎదిగిన తర్వాత అలా ఉండడం ఎంత అవసరమో అర్థమైంది. అలాగే అలా ఉండడం ఎంత కష్టమో కూడా అర్థమైంది' అన్నారు. ఇక చిన్న కుమార్తె తేజస్వి మాట్లాడుతూ.. ' నాన్న గ్రాఫ్ పెరగడానికి నేనే కారణమని సరదాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీళ్లిద్దరు మాట్లాడిన ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వం లో వస్తున్నా అఖండ 2 సినిమాతో బిజీగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: