విషయంలోకి వెళితే... ఇపుడు ఈ జోడి కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా వాళ్ళ కాంబినేషన్ కుదరాలని అభిమానులు ఆశలు పెట్టుకోగా తాజాగా వారి కాంబో సెట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఫాన్స్ ఖుషీ అయ్యారు. గతంలో కూడా సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. అయితే ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఫౌజీ' ప్రాజెక్ట్ ఒకటి. అందులో కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వీని కథానాయికగా ఎంపిక చేసిన సంగతి విదితమే. అయితే, కధని బట్టి ఈ సినిమాలో మరొక కథానాయికకు చోటు ఉందట. ఆ పాత్రలో నటించమని సాయి పల్లవిని సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక 'ఫౌజీ' సినిమా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడి పాత్రలో పోషిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయని వినికిడి. సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం కథానాయికగా సాయి పల్లవిని అడుగుతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. అందుకే ఇటీవల ఆమెను కలిసి కథ, ఆ క్యారెక్టర్ గురించి దర్శకుడు చెప్పగా... సాయి పల్లవి ఇంకా తన నిర్ణయాన్ని ఆలోచించుకొని చెబుతానని చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఆమె నిర్ణయం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి ఫిబ్రవరి 7న 'తండేల్' సినిమాతో థియేటర్లలోకి రానుంది. అది కాకుండా హిందీలో రణబీర్ కపూర్ సరసన సీతగా 'రామాయణ' సినిమాలో నటిస్తోన్న సంగతి విదితమే.