సౌత్ హీరోయిన్ కాస్త నార్త్ హీరోయిన్ గా మారిపోయింది. ఎందుకంటే కీర్తి సురేష్ ఇన్ని రోజుల వరకు సౌత్ హీరోయిన్ గానే ఉంది. కానీ బేబీ జాన్ మూవీ తో నార్త్ లో కూడా పాగా వేసింది.అయితే రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన అక్క అనే బోల్డ్ వెబ్ సిరీస్ టీజర్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ ని ఇప్పటివరకు చూడని బోల్డ్ లుక్ లో చూస్తామని టీజర్ తోనే అర్థమవుతుంది.అయితే అలాంటి కీర్తి సురేష్ పై తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.దానికి ప్రధాన కారణం ఏంటంటే..పెళ్లయి రెండు నెలలు కాకముందే కీర్తి సురేష్ తన మెడలోని తాళి తీసి వేయడం.. తాజాగా కీర్తి సురేష్ తన మెడలో నుండి తాళి తీసివేసిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు పెళ్ళై రెండు నెలలు కాకముందే మెడలో నుండి తాళి తీసేసావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. 

అయితే పెళ్లి తర్వాత బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో కీర్తి సురేష్ పసుపు తాడుతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక వెస్ట్రన్ డ్రెస్ లో కీర్తి సురేష్ మెడలో పసుపు తాడు కనిపించడంతో చాలామంది నెటిజెన్స్ సైతం హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అచ్చమైన తెలుగు అమ్మాయిలా మెడలో పసుపు తాడు వేసుకుంది.ఇక కొంతమంది హీరోయిన్లు అయితే సినిమాల కోసం అన్ని తీసేస్తున్నారు. కానీ కీర్తి సురేష్ మాత్రం మెడలో తాళి తోనే సినిమా ప్రమోషన్స్ కి వచ్చి సాంప్రదాయాన్ని పాటించింది అని మెచ్చుకున్నారు. కానీ ఎవరైతే అప్పుడు మెచ్చుకున్నారో మళ్ళీ వాళ్లే ఇప్పుడు కీర్తి సురేష్ ని తిడుతున్నారు.

పెద్ద పాతివ్రతలా అప్పుడు మెడలో పసుపు తాడు వేసుకొని తెగ షో చేసింది. ఇప్పుడేమో పెళ్లయిన రెండు నెలలకే మెడలో నుండి తాళి తీసేసి అందరి హీరోయిన్లలాగే నేను కూడా అని తన బుద్ధి చాటుకుంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఎవరో కొంతమంది నెగటివ్ కామెంట్లు పెట్టినప్పటికీ చాలామంది కీర్తి సురేష్ ని సపోర్ట్ చేస్తున్నారు.ఎందుకంటే పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు సినిమా షూటింగ్స్ కోసం మెడలో తాళి వేసుకోరు. అలా అందరిలాగే కీర్తి సురేష్ కూడా చేసింది. ఇందులో తప్పేముంది తన ప్రొఫెషన్ ని తాను ముందుకు తీసుకెళ్తుంది. ఇందులో కీర్తి సురేష్ పై నెగిటివ్ కామెంట్స్ చేయాల్సిన పనిలేదు అంటూ కీర్తి సురేష్ కి మద్దతు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: