టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న తర్వాత కొన్ని కొన్ని కోరికలను ఈజీగా తీర్చేసుకుంటూ ఉంటారు. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కొన్ని తీరని కోరికలు ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి కోరికలు చాలామందికి ఉంటాయి . కాగా ఆ లిస్టులోకి టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోస్ కూడా వస్తారు . మరి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదే విధంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా తమ లైఫ్ లో ఒక కోరికను అలా తీరని కోరికగానే మిగిలిపోయింది అన్న విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
ముగ్గురు కూడా బడా స్టార్స్ . ముగ్గురు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు ఉంటారు . అయితే ఈ ముగ్గురి లైఫ్ లో చిన్న కోరిక ఉంటుంది . కానీ ఆ కోరిక తీరకుండానే అయిపోయింది. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో నటించాలి అంటూ తెగ ఆశపడ్డారు . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రతి ఇంటర్వ్యూలోను తన ఫేవరెట్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని.. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను అని .. తన ఫస్ట్ లవ్ కూడా ఐశ్వర్య రాయ్ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.
అదేవిధంగా రామ్ చరణ్ కి ప్రభాస్ కి కూడా ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా ఆశపడ్డారు . కానీ అది కుదరలేదు. కొన్ని సినిమాలల్లో ఛాన్స్ వచ్చినా అది వచ్చిన్నట్లే వచ్చ్ చేజారిపోయింది. ఎంత పెద్ద బడా స్టార్ అయినప్పటికీ వాళ్లకు ఆ ఛాన్స్ రాలేదు . ఫ్యూచర్లో అలా ఛాన్స్ వస్తుంది అని కూడా చెప్పలేం . ఆ కోరిక తీరని కోరికగానే మిగిలిపోతుంది అంటున్నారు అభిమానులు. కాగా ప్రజెంట్ ముగ్గురు కూడా పలు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకెళ్తున్నారు..!