సాధారణంగా రాజమౌళి అనే పేరు వినపడగానే అందరికీ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి . ఆయన తెరకెక్కించే సినిమాలు సూపర్ డూపర్ గా హిట్ అవుతాయని ఆయనతో వర్క్ చేయాలి అంటే అదృష్టం ఉండాలి అని .. ఆయన పనితీరు గురించి ఇలా రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . అయితే రాజమౌళి గురించి నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తే మాత్రం ముఖ్యంగా అందరూ మాట్లాడేది పనితనం గురించి . రాజమౌళి పని పిచ్చోడు అంటూ చాలామంది స్టార్ హీరోస్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు ఓపెన్ గాని ఆ విషయాలను బయటపెట్టాడు .
మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో రాజమౌళి - తారక్ అదేవిధంగా చరణ్ కి చుక్కలు చూపించాడు అని ఓపెన్ గా వాళ్లే చెప్పుకొచ్చారు. నాటు నాటు స్టెప్స్ విషయంలో చాలా చాలా టార్చర్ చేశాడు అని .. ఎందుకురా ఈయన తో సినిమా అనిపించింది అని .. అంత దారుణంగా హింసించాడు అంటూ చెప్పుకు వచ్చారు . అయితే అలాంటి రాజమౌళిని టార్చర్ చేస్తూ చుక్కలు చూపించిన హీరో ఒకడు ఉన్నాడు . ఆయన మరెవరో కాదు ప్రభాస్ . అది కూడా బాహుబలి సినిమా విషయంలో . ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ .
బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్ కి స్పెషల్ డైట్ కండిషన్స్ పెట్టాడట రాజమౌళి . వన్డే కూడా చీట్ మీల్ లేకుండా రాసేసారట. దీంతో ప్రభాస్ ..జక్కన్న కి చుక్కలు చూపించేస్తూ ప్రతి సీన్ షాట్ తర్వాత రాజమౌళిని తెగ విసిగించేసేవాడట..ఆ విషయం కారణంగా సర్దాగానే టార్చర్ పెట్టేవారట . కొన్నాళ్ల తర్వాత ప్రభాస్ బాధ చూడలేక రాజమౌళి డైట్ లో మార్పులు చేస్తూ వన్డే చీటింగ్ మీల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట . వారంలో ఆరు రోజులు మొత్తం రాజమౌళి చెప్పిన డైట్ ఫాలో అయిన మిగతా ఒక్కరోజు మాత్రం ప్రభాస్ కి నచ్చిన ఫుడ్ మొత్తం నచ్చిన ఫుడ్ తినేస్తాడట. ఈ విషయాన్ని వాళ్లే ఓపెన్గా బయట పెట్టడం అందరికీ షాకింగ్ గా అనిపించింది..!