- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


డైరెక్టర్ బాబి కొల్లిగా తెలుగు సినిమా అభిమానుల‌కు దగ్గరైన ఆయన అసలు పేరు కేఎస్ రవీంద్ర. గుంటూరు కి చెందిన బీకాంలో డిగ్రీ పూర్తి చేసే సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్కు చేరుకున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో సినిమా పరిశ్రమలో విజయం సాధించాడు. ఏకంగా చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతోనే సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టారు. తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్యతో డాకు మహారాజు సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాబీ చాలా రోజులపాటు టాలీవుడ్లో గోస్ట్ రైటర్గా పనిచేశారు. మొదటిసారి 2008లో శ్రీహరి నటించిన హిట్ సినిమా భద్రాద్రి కథతో బాబీ ప్రయాణం కొనసాగింది.


తర్వాత డాన్ శీను - బాడీగార్డ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. బలుపు - అల్లుడు శీను వంటి సినిమాల కు కథను అందించిన ఆయన తొలిసారి 2014లో రవితేజ హీరోగా వచ్చిన ప‌వ‌ర్ సినిమా తో దర్శకుడుగా మారి మెగాఫోన్ పట్టుకున్నారు. అక్కడి నుంచి తనదైన స్టైల్ లో సర్దార్ గబ్బర్ సింగ్ - జై లవకుశ - వెంకీ మామ - వాల్తేరు వీరయ్య - డాకు మహారాజు లాంటి టాప్ సినిమాలు ఎక్కించారు. ఇక చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను బాబి ప్రేమ వివాహం చేసుకున్నారు. స్కూల్లో చదువుతున్న సమయంలోనే తనను నేను ప్రేమించాను ... ఒక సందర్భంలో నీళ్ల బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారి ఫైనల్ గా పెళ్లి వరకు వెళ్లింది .. అనుష్క స్కూల్ టాపర్ .. చాలా కష్టపడి చదువుతుంది ఆమె ఇంజనీరింగ్ గోల్డ్ మెడల్ లిస్ట్ అని బాబి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: