నాగార్జున నటించిన సూపర్ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇందులో (డాక్టర్ గా )నటించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు వచ్చిన ఈ అమ్మడు తెలుగులో పెద్దగా అవకాశాలు రాబట్టలేకపోవడంతో మళ్లీ తిరిగి బాలీవుడ్ వైపుగానే అడుగులు వేసింది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది.. ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ఫర్హాన్ అజ్మీని ప్రేమించి మరి వివాహం చేసుకుంది ఆయేషా టాకీయా.. ఈమె పెళ్లి కోసం మతాన్ని కూడా మార్చుకుందట..
ఫర్హాన్ అజ్మీత మూడేళ్లు డేటింగ్ చేసిన ఈమె.. అతడిని వివాహం చేసుకొని ఆయేషా టాకీయా అజ్మీ గా మార్చుకున్నదట. అయితే వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు అసలు విషయాన్ని ఈ ఆమ్మడు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు నేటిజెన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఫర్హాన్ అజ్మీ ఎవరో కాదు సమాజ్వాద్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి కుమారుడే ఈ ఫర్హాన్ అజ్మీ ఆట.. మొత్తానికి తనకు నచ్చిన వాడిని వివాహం చేసుకొని సెటిలైపోయింది ఈ సూపర్ బ్యూటీ. మరి ఇప్పుడైనా సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఖుషి చేస్తుందా లేకపోతే ఈమె కూడా బిజినెస్ వైపుగా బిజీ అవుతుందో చూడాలి మరి.