ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ల్లో అక్కినేని ఫ్యామిలీ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ ప్రేమ కథా చిత్రమే “ తండేల్ ”. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా లో చైతుకు జోడీగా సాయి పల్లవి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ తో పాటు బన్నీ వాస్ లాంటి ఇద్దరు ప్రామీసింగ్ నిర్మాతలు కలిసి సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మిస్తుండడంతో మంచి అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా చైతూ కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ ని ప్రామిస్ చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఓవర్సీ స్ మార్కెట్ లో నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకునేలా ఉందని ట్రేడ్ వర్గాల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు నార్త్ అమెరికా ప్రాంతంలో చైతూ - సాయి పల్లవి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ కెరీర్ బెస్ట్ కాగా ... ఇపుడు దీనిని తండేల్ సినిమా ఖచ్చితంగా బీట్ చేస్తుందని కూడా ట్రేడ్ వర్గాల ముందస్తు అంచనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే వరుస ప్లాపు ల్లో ఉన్న చైతు చైతు మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ తండేల్ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు .. సినిమా ట్రైలర్ .. సాంగ్స్ కు మంచి బజ్ అయితే వచ్చింది. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.