`దేవర`తో గత ఏడాది బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం `వార్ 2`లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్టీఆర్ కు డెబ్యూ మూవీ ఇది. ఆయాన్ ముఖర్జి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ లైనప్ లో `దేవర 2`తో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. వార్ 2 అనంతరం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.
ఈ ప్రాజెక్ట్ కు `డ్రాగన్ ` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇకపోతే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం నీల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో ఓ మలయాళ స్టార్ హీరో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. టోవినో థామస్. మాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అయిన టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ` మిన్నల్ మురళి` అనే సూపర్ హీరో మూవీ మరియు 2018 అనే చిత్రం తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవ్వడంతో టోవినో థామస్ తెలుగువారికి చేరువ అయ్యాడు. అలాగే ఇటీవల విడుదలైన `ఎఆర్‌ఎం ` చిత్రంతో టోవినో థామస్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడీ మలయాళ హీరో ఎన్టీఆర్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే.. బొమ్మ అదుర్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.