డాకు మహారాజ్ విషయానికి వస్తే.. ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. టాక్ బాగున్నా కూడా పోటీగా వెంకీ చిత్రం ఉండటంతో డాకు మహారాజ్ కు థియేటర్స్ లో జనాలు కరువయ్యారు. 1600 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన డాకు మహారాజ్‌ను మూడోవారానికి సగానికి సగం థియేటర్స్‌లో లేపేశారు. మిగిలిన స్క్రీన్స్‌లలో కూడా ఆక్యుపెన్సీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతోంది. బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో.. కనీసం ఆ ఈవెంట్ జరిగే వరకైనా థియేటర్స్ లో డాకును ఆడించాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్రిస్తున్నారు.
కానీ, డాకు మహారాజ్ థియేటర్స్ లో ఈగలు, దోమలే తప్ప మనుషుల్లేరంటూ కొందరు నెటిజన్లు మాస్ ర్యాగింగ్ షురూ చేశారు. తాజాగా ఈ జాబితాలో ` గుప్పెడంత మనసు ` సీరియల్ యాక్టర్ మను అలియాస్ రవి శంకర్ రాథోడ్ కూడా చేరాడు. తాజాగా రవి శంకర్ తన బ్రదర్ తో కలిసి హైదరాబాద్ లో డాకు మహారాజ్ మూవీ చేసేందుకు థియేటర్ కు వెళ్లాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ థియేటర్ లో ఈ ఇద్దరు బ్రదర్స్ తప్ప మరో మనిషే లేడు. ఇదే విషయాన్ని రవి శంకర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
` మేము చాలా రిచ్.. మా అన్నయ్య కోసం థియేటర్ మొత్తం బుక్ చేశా.. నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నయ్యా.. నువ్వు అడిగితే నేను ఏమైనా చేస్తాను` అంటూ రవి శంకర్ థియేటర్ లో ఖాళీ కుర్చీలను చూపిస్తూ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పక్కనే ఉన్న అతని బ్రదర్ బాలయ్య మూవీ అని చెప్పడంతో.. అది డాకు మహారాజ్ షో అని స్పష్టమైంది. ప్రస్తుతం రవి శంకర్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.