మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో సక్సెస్ సాధించిన మహేష్ బాబు తర్వాత వంశీ , యువరాజు సినిమాల్లో నటించాడు. వంశీ సినిమాలో నమ్రతతో కలిసి నటించిన మహేష్ బాబు ఆమెతో ప్రేమలో పడ్డాడు వీరిద్దరూ ఒకరినొకరు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. కానీ వీరి ప్రేమను కృష్ణ అంగీకరించలేదట. దీనికి కారణం కృష్ణ మహేష్ బాబుకు ఒక అచ్చు తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకోవడమేనట. కానీ మహేష్ బాబు తల్లి కృష్ణను ఒప్పించారట. వీరిద్దరి లవ్ స్టోరీ మొదలైనప్పటి నుంచి మహేష్ అక్క మంజుల వీరి లవ్‌కి గట్టి సపోర్ట్ గా నిలిచింది..
మహేష్ - నమ్రతల పెళ్లి జరగడానికి ఆమె కీరోల్ ప్లే చేసిందని సమాచారం. చివరికి వీరిద్దరూ 2005 ఫిబ్రవరి 10న మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం నమ్రత.. మహేష్ బాబు వ్యాపారాలను చూసుకుంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో తన కెరీర్ ఇప్పటివరకు చెయ్యని ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడు.. అలాగే రీసెంట్ గానే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్కు జంటగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది.. అలాగే మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు.. ఈ సినిమాతో రాజమౌళి గ్లోబల్ సినిమాకు భారీ సవాల్ ఇస్తున్నాడు.