ఇప్పటికే వీరందరూ ఈ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతుండగా .. స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమా షూటింగ్లో అడుగుపెట్టింది. . ప్రముఖ మలయాళ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు .. రీసెంట్ గా యాశ్ పుట్టినరోజు సందర్భంగా టాక్స్ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చింది .. ఇక అందులో యాశ్ ఎంతో వైల్డ్ రగ్డ్ లుక్ లు అందరినీ ఆకర్షించాడు.
అలాగే టాక్సిక్ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ కూడా వర్క్ చేస్తున్నారు .. అలాగే ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటిష్ నుటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది .. మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా టాక్సిక్ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నాడు యాశ్. ఈ క్రమంలోనే 1915 నుంచి చిత్ర నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ప్రపంచంలోనే పురాతన అత్యుత్తమ స్టూడియోలో ఒకటైన 20వ సెంచరీ ఫాక్స్‌తో యాశ్ పలు చర్చలు జరుపుతున్నాడు .. అదే విధంగా టాక్సిక్ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారని కూడా టాక్ బయటకు వస్తుంది.