చిరంజీవి - భానుప్రియ జంటగా బి.గోపాల్ డైరెక్షన్లో రూపొందిన స్టేట్ రౌడీ సినిమాకు కాపీగా పోకిరి సినిమా రిలీజ్ అయిందట. 1988లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ యాక్షన్ క్రైమ్ మూవీ దివార్ సినిమా నుంచి కాపీ కొట్టి తీశారని అంటారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, శశి కపూర్ నటించారు. అమితాబ్ రౌడీగా శశి కపూర్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. స్టేట్ రౌడీ సినిమాలో రెండు పాత్రలను చిరంజీవినే పోషించాడు. ఇందులో రౌడీలను ఎలిమినేట్ చేసే రౌడీ కాళీ చరణ్ గా నాగమణి దగ్గర పని చేస్తున్న పోలీస్ ఇన్ ఫార్మర్ గా కనిపిస్తాడు. నాగమణి కుమార్తె భానుప్రియ (ఆశ) ను హత్యా నేరం నుంచి కాళీ చరణ్ నిర్దోషిగా విడుదల చేస్తాడు. కాళీ, నాగమణి తన శత్రువులను న్యాయస్థానానికి రప్పించి వారిని వదిలించుకుంటారు.
దివార్ సినిమాకు ఈ సినిమా పాత్రలపరంగా భారీగా కాపీ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. రెండు సినిమాలు వేర్వేరు సెట్టింగుల్లో ఉన్నప్పటికీ పాత్రలు వేరువేరైనా కొన్ని సీన్స్ మాత్రం కాపీ చేశాడు దర్శకుడు బి.గోపాల్. ఇక ఇదే విధంగా మహేష్ బాబు కూడా పోకిరి సినిమాలో మొదట రౌడీషీటర్‌గా కనిపించి తర్వాత పోలీస్ అనే విషయం రివీల్ అవుతుంది. రెండు సినిమాలు ఒక గ్యాంగ్‌స్టార్‌గా కదా నాయకుడు కనిపిస్తాడు. కానీ అతను మంచి వ్యక్తి అవ్వడం విశేషం. పోకిరి ఈ తరానికి తగ్గట్టుగా కథను మార్చి స్టేట్ రౌడీ కంటే ఎక్కువ యాక్షన్స్ సన్నివేశాలతో రూపొందించి ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాడు పూరి జగన్నాథ్