గతంలో ఏ సర్టిఫికెట్ అంటే సినిమా యూనిట్ కు ఎంతో భయం .. అమ్మో ఫ్యామిలీ ప్రేక్షకులు రారేమో అని .. కానీ ఇప్పుడు ఏ సర్టిఫికెట్ అంటే మరింత ఎలివేషన్ ఫీల్ అవుతున్నారు .. యానిమల్ సినిమాను ఏ సర్టిఫికెట్ తోనే ఈరగబడి చూశారు .. అలాగే బేబీ సినిమాను కూడా ఏ సర్టిఫికెట్ తోనే సక్సెస్ చేశారు .. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సినిమాలు ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాయి .. కానీ ఇంకా టాలీవుడ్ హీరోలకు ఎందుకు ఏ సర్టిఫికెట్ అంటే కొంత భయం కలుగుతుంది .. తమను ఫ్యామిలీ ఆడియన్స్ దూరం చేసుకుంటారని అనుమానం వారిలో ఉంటుంది.


విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ లైలా .. సెన్సార్ కు వెళ్ళింది .. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్ రావాల్సి ఉంది .. అయితే సినిమా కంటెంట్ పరంగా ఏ వస్తుందా.. యూ / ఏ వస్తుందా అన్నది అందరిలో అనుమానం .. సెన్సార్ పూర్తయితే తప్ప క్లారిటీ రాదు .. ఒకవేళ సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇస్తే ఏం చేయాలి .. సినిమాలో కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతాయా అనుకున్న సీన్లు డైలాగులు తీసేసి  యూ / ఏ ఇస్తే ఏం లాభం ? ఎలాంటి కట్ లు లేకుండా ఏ సర్టిఫికెట్ ఇచ్చిన ఎలాంటి సమస్య ఉండదు .


కానీ ఇవన్నీ ఎప్పుడు అంటే అసలు సినిమా చూసి సెన్సార్ వాళ్లు ఏమంటారు అన్న దాని తర్వాత .. ఇక ఇప్పుడు లైలా యూనిట్ అదే టెన్షన్లో ఉంది .. లైలా సినిమాలో విశ్వక్ మొదటిసారి సినిమాలో సగం లేడీ  గెటప్ లో న‌టించిడు .. ఆ లేడీ గెటప్ లో ఉండే హ్యూమర్ కాస్త బోర్డర్ దాటి బోల్డ్‌ టచ్ లో ఉందని కూడా తెలుస్తుంది .. ఇదే ఈ సినిమా యూనిట్‌కు కొంత టెన్షన్ లో పడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: