ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక అలా రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఈ వారం ఎన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీ సిరీస్ కూడా ఈ నెల 7 న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కధ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ సమారంపై నడుస్తుంది.  
జీ5 ఓటీటీలో మిసెస్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఆర్తి కడవ్ దర్శకత్వం వహించారు. ఇక ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వివేకానందన్ వైరల్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే హాట్ స్టార్ ఓటీటీలో కోబలి మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి రేవంత్ లెవక దర్శకుడు. ది మెహతా బాయ్స్ సినిమా కూడా ఫిబ్రవరి 7వ తేదీన ఓటీటీలో రిలీజ్ అవుతుంది. బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ ఈ మూవీకి ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ కలిసి నటించిన బేబీ జాన్ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తేరికి అనే తమిళ మూవీని హిందీ రీమేక్‍గా చేసి డైెరెక్టర్ కలీస్ ఈ సినిమాను తెరకెక్కించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: