పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.
ఇక సోషల్ మీడియాలో విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇటీవలే ప్రభాస్ కి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో ఆయన చెబుతున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే ఇటీవల కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ లుక్ లో ప్రభాస్ ఏం బాలేడని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మంచు లక్ష్మి, స్టార్ హీరో ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

హీరో ప్రభాస్ ప్రతి దానికి ఒకే చెప్తాడు అని మంచు లక్ష్మి చెప్పింది. ప్రభాస్ కి నో చెప్పడం తెలిదని తెలిపింది. ఎవరితో అయిన ఒకసారి కనెక్ట్ అయ్యడంటే వాళ్లకి అసలే నో చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఒకసారి టీచ్ ఫర్ ఛేంజ్ అనే కార్యక్రమం కోసం తాను ప్రభాస్‌ని సాయం అడిగింది అంట. దానికి ప్రభాస్ వెంటనే ఎంత డబ్బు కావాలి చెప్పు అని అడిగడాని తెలిపింది. తర్వాత మంచు లక్ష్మి తనకి కావాల్సింది డబ్బు కాదని.. ఈ ఈవెంట్ గురించి ఒక ట్వీట్ పెడితే చాలని తెలిపింది. అలాగే వారందరి కంటే కూడా మంచు మోహన్ బాబుకి, ప్రభాస్ ఎక్కువ క్లోజ్ అని ఆమె చెప్పింది. వాళ్లు ఇద్దరు తరచూ మాట్లాడుకుంటూ ఉంటారని మంచు లక్ష్మి తెలిపింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: