బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రేరణ కంబం అంటే తెలియని వారుండారు. బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరికి నిలిచింది. సీజన్ 8లో టాప్ 5లో నిలిచిన లేడి టైగర్ గా పేరు తెచ్చుకుంది. ప్రేరణకి ఉన్న ఫాన్స్ బేస్ అంతా ఇంత కాదు. అయితే ప్రేరణ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు యాంకర్ ఓంకార్ హౌస్ లోకి వెళ్లి వాళ్లతో కొన్ని ఆటలు ఆడించారు. ఆతర్వాత ఆయన ప్రేరణ ని నువ్వు ని భర్తతో కలిసి ఇస్మార్ట్ జోడీలోకి రావాలి అని చెప్పుకొచ్చాడు.
ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టింది. ఇటీవల ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం అయ్యింది. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి.
ఇక సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఓంకార్ అడిగినట్లు గానే.. ప్రేరణ తన భర్త శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇస్మార్ట్ జోడీ షోలో ఈమె కనిపించని ప్రోమో లేదు. తన భర్తతో కలిసి షోలోకి వచ్చిన ప్రేరణ అన్నీ టాస్క్ లను గట్టిగా ఆడుతుంది.. అందరికీ మంచి పోటీ ఇస్తుంది. ఇక ఈ షోలో ఇప్పటికే అమర్ దీప్- తేజు టాప్ వన్ జోడీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రేరణ, శ్రీపాద్ జంట టాప్ టూ గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: