ఏంటి నాగచైతన్యకు సమంత కంటే ముందే పెళ్లయ్యిందా.. అంటే ఇప్పుడు శోభితతో జరిగింది మూడో పెళ్ళా.. సమంతని రెండో పెళ్లి చేసుకొని శోభితను మూడో పెళ్లి చేసుకున్నారా.. ఎందుకు సమంత అలాంటి కామెంట్లు చేసింది..నిజంగానే నాగచైతన్యకు మొదటి భార్య ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్యకు నిజంగానే ఫస్ట్ వైఫ్ ఉందట. అవును ఈ విషయాన్ని స్వయంగా సమంతనే ఓ ఈవెంట్ లో చెప్పింది.మరి ఇంతకీ నాగచైతన్య మొదటి భార్య ఎవరయ్యా అంటే ఆయన ఫేవరెట్ దిండు.. మరి ఇంతకీ  ఆ దిండు కథ ఏంటయ్యా అంటే..సమంత నాగచైతన్యతో కలిసి ఉన్న సమయంలో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఈవెంట్లో తన భర్త నాగచైతన్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది. సమంతఈవెంట్ లో మాట్లాడుతూ.. మీరందరూ నేను నాగచైతన్యకు ఫస్ట్ వైఫ్ అనుకుంటారు. 

కానీ మీరు అనుకుంటున్నట్టు ఫస్ట్ వైఫ్ నేను కాదు. ఆయన ఫేవరెట్ దిండే ఆయనకి ఫస్ట్ వైఫ్.. నేను ఆయనకు రెండో పెళ్ళాన్ని.. నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా నాగచైతన్య ఆ దిండుని పక్కన పెట్టలేదు. కూర్చున్నా పడుకున్నా ఆ దిండు చైతూ పక్కన ఉండాల్సిందే. మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నా కూడా మా ఇద్దరి మధ్యలో ఆ దిండు ఉంటుంది.అంతేకాదు  చైతూ కి నేను ముద్దు పెట్టిన కూడా ఆ దిండు పక్కనే ఉంటుంది.

అలా నాకంటే ముందే నాగచైతన్య ఫస్ట్ వైఫ్ గా ఆ దిండు సెటిల్ అయింది అంటూ సమంత ఆ ఈవెంట్లో చెప్పి అందరితో నవ్వులు పూయించింది. ప్రస్తుతం అప్పటి వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది జనాలు షాక్ అవుతున్నారు. ఈ లెక్కన చూస్తే సమంత రెండో పెళ్ళాం అయితే శోభిత మూడో పెళ్ళామే కదా..నాగ చైతన్యతో ఉంటున్న శోభితకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: