తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్న కుటుంబం అని కూడా చెప్పవచ్చు. ఒకప్పుడు ఈ కుటుంబం నుంచి సినిమాలు కోసం చాలామంది అభిమానులు థియేటర్ల వద్ద క్యూలో నిలబడి గంటల తరబడి టికెట్లు కొనేవారు. ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఎక్కువగా ఉండేవారని కూడా చెప్పవచ్చు. అయితే రాను రాను చిరంజీవి క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా భారీ ఫ్లాప్ ని మూట కట్టుకున్నదట.


మెగా ఫ్యాన్స్ సినిమాలను సక్సెస్ చేయడానికి ఆస్తులు అమ్మేసి మరి హైక్స్ వచ్చేలా క్రియేట్ చేస్తున్నారట. తాజాగా వంగవీటి మోహన్రంగా అనే ట్విట్టర్ నుంచి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ఫిబ్రవరి 4వ తేదీన ఒక వీడియోని షేర్ చేయగా ఇందులో ఒక వ్యక్తి లుంగీ కట్టుకొని చిరిగిన చొక్కా వేసుకొని చిరంజీవి అన్న 40 ఏళ్లుగా నిఅభిమానిగా ఉన్నాను సినిమాలు చూడడం రక్తం ఇవ్వడం తప్ప అన్న అంటూ మొరపెట్టుకుంటున్నారు.. నీకోసం భూమి జాగా అన్ని కూడా అమ్మేసుకున్నాము.. నాకు ఇల్లు లేదు ముగ్గురు ఆడపిల్లలు ఎలా పోషించాలన్న నాకు ఒక కన్ను లేదన్న వికలాంగుడిని.. ఇప్పుడు ఎకరం భూమి కోటి రూపాయలు అయ్యింది. ఇల్లు కట్టే స్తోమత కూడా లేదని లాస్ట్ కి చిప్ప గతి తనకు మిగిల్చావ్ అంటూ మాట్లాడుతున్నారు.. సినిమా చూసి తప్పు చేసామా నువ్వు దాచుకొని దోచుకొని మాకు అన్యాయం చేస్తావా  అంటూ ప్రశ్నిస్తున్నారు..


అసలు విషయంలోకి వెళ్తే ఈ వీడియో బుట్ట బాలాజీ వివరాలను అందించారట.. మహబూబ్ బాద్ జిల్లా కేంద్రంలో ఉండే భవాని నగరానికి చెందినటువంటి బట్టు బాలాజీ చిన్న వయసు నుంచి చిరంజీవి అభిమాని ఆట.  చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమాకి వెళ్లిన సమయంలో తన కంటి చూపుని కోల్పోయాడని.. చిరంజీవి పేరు మీద చాలా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ వంటివి చేస్తూ ఉండేవారట. అయితే తనకు రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే బట్టు బాలాజీకి ప్రజారాజ్యం పార్టీలో నుంచి సీటు ఎమ్మెల్యేగా ఇవ్వలేదని.. ఆ తర్వాత వచ్చినటువంటి స్థానిక ఎన్నికలలో సైతం ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనకున్న భూమిని అమ్మేసుకున్నారని సమాచారం. అంతేకాకుండా తార్నాకలో ప్రజారాజ్యం పార్టీ ఆఫీసుకి సైతం రెండేళ్లపాటు ఈ వ్యక్తి అద్దె కట్టారట. మరి చిరంజీవి విషయం పైన స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: