టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నిత్యా మేనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. నిత్యా మేనన్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు అంటూ వుండరు.. కేవలం కళ్ళతో హవభావాలు పలికించ గల అద్భుతమైన నటి నిత్యా మేనన్.. ఈ భామ స్వతహాగా మలయాళి అయినా బెంగళూరులో జన్మించింది.. నిత్యా మేనన్ బాల నటిగా కూడా నటించి మెప్పించింది. 8 ఏళ్ల వయసులోనే ఒక ఇంగ్లిష్ మూవీ “ది మంకీ హూ న్యూ టూ మచ్”లో నటించింది.. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ టబు చెల్లెలుగా నిత్యా మేనన్ నటించింది..2008 లో మలయాళ మూవీ “ ఆకాశ గోపురం “ అనే సినిమాతో ఈ భామ హీరోయిన్ గా మారింది..తెలుగులో నిత్యా మేనన్ నాని నటించిన ‘అలా మొదలైంది ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాను నందినీ రెడ్డి తెరకేక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో తరువాత నిత్యా మేనన్ టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు అందుకుంది.. 

భామ టాలెంట్ కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. గ్లామర్ రోల్స్ కి దూరంగా వుంటూ పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రలతో నిత్యా మేనన్ అద్భుతంగా రాణించారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సినిమాలలో కూడా ఈ భామ నటించి మెప్పించింది.2011 లో సిద్దార్థ్ హీరోగా వచ్చిన “ నూట్రేన్ బంధు” సినిమాతో ఈ భామ తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. తన టాలెంట్ తో అక్కడి ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంది.. 

విజయ్ దళపతి, ధనుష్ వంటి స్టార్ యాక్టర్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. రీసెంట్ గా ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుని నిత్యా మేనన్ చరిత్ర సృష్టించింది.. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్స్ స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం గ్లామర్ ఓలకబోస్తుంటే నిత్యా మేనన్ మాత్రం పెర్ఫార్మన్స్ రోల్స్ తో దూసుకుపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: