ఈ మధ్యకాలంలో ఇది ఒక కొత్త ట్రెండ్ గా మారిపోతుంది. ప్రేమించుకోవడం ..పెళ్లి చేసుకోవడం ..మూడు రోజులు ముచ్చట అయిపోయాక విడాకులు తీసుకోవడం. ఇదే తంతును ఎక్కువగా కొనసాగిస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . ముఖ్యంగా సినిమా స్టార్స్ క్రికెటర్స్ స్టార్స్ బడా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ వాళ్ళ పిల్లలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.  డేటింగ్ అంటూ ఫారిన్ కల్చర్ ని ఫాలో అవుతూ పెళ్లికి ఉన్న సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు . రీసెంట్గా ఎంతమంది స్టార్ కపుల్స్ చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు అనేది అందరికీ తెలుసు .


నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన స్టార్స్ ఇలా చిన్నచిన్న కారణాలకు డివర్స్ తీసుకుంటే నెక్స్ట్ అసలు సమాజం ఎటు పోతుంది అంటూ కూడా చాలామంది జనాలు మాట్లాడుకున్నారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పేర్లు మరొకసారి ట్రెండిం గా మారాయి.  వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు . నాగచైతన్య కి ఇది రెండో పెళ్లి . శోభిత ధూళిపాళ్లకి నాగచైతన్య మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే వాటిపై పెద్ద రియాక్ట్ అవ్వలేదు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల.



ఏకంగా నిశ్చితార్థం చేసుకొని పెళ్లి బట్టల్లో దర్శనమిచ్చారు. ఇప్పుడు భార్యాభర్తలు గా మారిపోయారు . వైవాహిక జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళుతున్నారు. అయితే రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక టాప్ సీక్రేట్ బయటపడి సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . సమంతతో జరిగిన ఇష్యూ కారణంగా నాగచైతన్య - శోభిత  దగ్గర స్పెషల్ అగ్రిమెంట్ రాయించుకున్నారట నాగార్జున . సమంత - నాగచైతన్య అసలు విడిపోతారని ఎవరు  అనుకోలేదు.  వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు .



ఆ టైంలో కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఎదుర్కొన్నారట . ఇద్దరు కలిసి కొన్న ప్రాపర్టీస్ అదే విధంగా మరికొన్ని సమస్యలు ఫేస్ చేశారట . ఈ క్రమంలోనే ఫ్యూచర్లో శోభిత - నాగచైతన్య విడిపోయిన సరే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పక్కాగా లీగల్ గా అగ్రిమెంట్ చేయించి ఎవరికి ఎంత రావాలి అనేది ముందుగానే లెక్కలు సెట్ చేశారట . ఒకవేళ ఫ్యూచర్లో నాగచైతన్య -శోభిత  ధూళిపాల విడిపోయిన శోభిత ధూళిపాళ్లకి - అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీలో ఒక్క రూపాయి కూడా వెళ్లదు . ఆ విధంగానే నాగార్జున అగ్రిమెంట్ రాయించారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  ఇదేం కొత్త అగ్రిమెంట్ రా బాబోయ్.. ఎవరైనా కలిసి ఉండాలని కోరుకుంటారు ఇలా విడిపోతారని ముందుగానే ప్లాన్ చేస్తారా ..? అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: