దివంగత నటి శ్రీవిద్య.. ఒకప్పుడు సాంప్రదాయమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది శ్రీవిద్య. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. రజినీ, కమల్ కాంబినేషన్ లో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమా ద్వారా శ్రీవిద్య పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.ఆ తర్వాత శ్రీవిద్యకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక శ్రీవిద్య కి ఏజ్ మీద పడి హీరోయిన్ అవకాశాలు తగ్గాక కూడా తల్లి పాత్రలు మాత్రం ఎక్కువగా వచ్చాయి.అలా తల్లి పాత్రల్లో కూడా శ్రీవిద్య నటించింది.కానీ శ్రీవిద్య మరణం చాలా బాధాకరం. ఎందుకంటే ఆమె రొమ్ము క్యాన్సర్ తో మరణించింది. కోట్లు ఆస్తులు సంపాదించిన శ్రీవిద్య ఆస్తులన్నింటినీ ఒక ట్రస్ట్  పేరిట రాసి కన్ను మూసింది. అయితే అలాంటి శ్రీవిద్య కెరీర్ నాశనం అవ్వడానికి కమల్ హాసన్ కారణమంటారు.. 

దానికి ప్రధాన కారణం అపూర్వ రాగంగళ్ సినిమాలో నటించిన సమయంలో శ్రీవిద్య కమలహాసన్ తో ప్రేమలో పడిందట. ఆ సమయంలో వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారట. ఇక వీరి ప్రేమకు వ ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో అడ్డేది లేదు.కానీ కమల్ హాసన్ శ్రీవిద్యను పెళ్లి చేసుకోలేదట. ఆ తర్వాత కమల్ హాసన్ మీద కోపంతో డైరెక్టర్ జార్జ్ థామస్ ని ప్రేమించింది.అయితే ఆయన్ని పెళ్లి చేసుకునే ముందే బాప్టిజం తీసుకోవాలనే కండిషన్ పెట్టడంతో మతం మార్చుకుంది.అయితే పెళ్లయిన కొద్ది రోజులకే భర్త నిజ స్వరూపం తెలుసుకుంది శ్రీవిద్య.అంతే కాదు కేవలం డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నాడనే నిజం తెలుసుకున్న శ్రీవిద్య అతనికి విడాకులు ఇచ్చేసింది.

అలా పెళ్లయిన నాలుగేళ్లకు వీళ్ళకి విడాకులు వచ్చేసాయి. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసిన శ్రీవిద్య అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు ఇంటిపట్టునే ఉంది. ఆ తర్వాత టెస్టులు చేయించుకోగా తనకి రొమ్ము క్యాన్సర్ ఉందనే సంచలన నిజం బయటపడింది.ఆ తర్వాత తన చివరి రోజుల్లో తన ప్రేమికుడు కమల్ హాసన్ తో ప్రేమగా మాట్లాడాలని కోరుకుంది. ఇక శ్రీవిద్య కోరిక ప్రకారమే కమల్ హాసన్ కూడా శ్రీవిధ్య చివరి రోజుల్లో ఆమె పక్కనే ఉన్నాడు.అలా శ్రీవిద్య సినీ కెరియర్ తో పాటు పర్సనల్ కెరియర్ కూడా డిస్టర్బ్ అవ్వడానికి కమల్ హాసన్ కారణమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: