తండేల్.. ప్రజెంట్ ఇప్పుడు ఎవ్వరి నోట విన్న సరే ఇదే పేరు బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో హీరో నాగచైతన్య ఎంతో ఇష్టంగా నటించిన సినిమానే ఈ తండేల్. ఈ సినిమాకి హైలైట్ హీరోయిన్ సాయి పల్లవి . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి యాక్సెప్ట్ చేసింది అని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాకి హ్యుజ్ బజ్ క్రియేట్ అయింది . మరి ముఖ్యంగా చందు మండేటి రిలీజ్ చేసే అప్డేట్స్.. నాగచైతన్య లుక్స్..సాయి పల్లవి డైలాగ్స్.. సినిమాని వేరే లెవెల్ లో తీసుకెళ్లబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేలా చేసింది .


మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండడం దానికి తగ్గట్టే సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి ఈ తండేల్ సినిమాల్లో చందు మొండేటి ముందుగా ట్రెడిషనల్ హీరోయిన్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ని చూస్ చేసుకున్నారట . కీర్తి సురేష్ అయితే చాలా బాగుంటుంది . ఆప్ట్ గ్ గా సెట్ అవుతుంది అంటూ ఆమెకు  కథ వినిపించగా ఆమె కొన్ని కొన్ని సీన్స్ నచ్చక వేరేగా మార్చండి అంటూ రిక్వెస్ట్ చేసిందట .



అయితే చందూ మండేటి ఎంతో ఇష్టంగా రాసుకున్న సీన్స్ ను మార్చడానికి ఇష్టపడలేదట . ఆ టైంలోనే అల్లు అరవింద్ సలహా మేరకు ఈ సినిమాలో సాయి పల్లవిని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది.  సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మంచి సినిమాని మిస్ చేసుకున్నింది కీర్తి సురేష్ అంటూ జనాలు మండిపడుతున్నారు.  ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ఖాతాలో ఒక హిట్ కూడా పడలేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశా ఈ సినిమా చేసుంటే ఆమెకి హిట్ పడుండేది ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: