ఏంటి నాగార్జున నాగచైతన్యకి నిజంగానే వార్నింగ్ ఇచ్చారా..ఇంతకీ కొడుకు చేసిన తప్పేంటి తండ్రి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా పైనే తన కెరీర్ ఆధారపడి ఉంది.ఒకవేళ ఈ సినిమా కనుక ప్లాఫ్ అయితే నాగచైతన్య సినీ కెరియర్ ఇరుకున పడ్డట్టే.. భారీ బడ్జెట్ తో వస్తున్న తండేల్ మూవీ హిట్ అయితే మాత్రం నాగచైతన్య కెరీర్ గాడిన పడుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్యకు నాగార్జున వార్నింగ్ ఇచ్చినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం నాగచైతన్య అన్ స్టాపబుల్ షో కి ప్రమోషన్స్ కోసం వెళ్లడం.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో చాలామంది సినిమా రిలీజ్ కి ముందు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి వెళ్లి ప్రమోషన్స్ చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

అన్ స్టాపబుల్ షోకి వెళ్తే తమ సినిమాకి ప్లస్ అవుతుంది.అలాగే ప్రమోషన్ కూడా అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు. అలా పుష్ప-2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం,డాకు మహారాజ్ ఇలా ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ అన్ స్టాపబుల్ వేదికగా చేసుకున్నారు. అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా తండేల్ సినిమా ప్రమోషన్స్ కూడా కి కూడా అన్ స్టాపబుల్ షో యూస్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో నాగచైతన్య బాలకృష్ణ షో కి వెళ్ళాలి అనుకున్నారట. అయితే దీనికి అల్లు అరవింద్, బన్నీ వాసులు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయం నాగార్జునకు తెలిసి నువ్వు ఆ షో కి వెళ్తే ఇంట్లోకి కూడా రావు ఇంట్లో నుండి గెంటేస్తే అని నాగార్జున కొడుకు కి వార్నింగ్ ఇచ్చారట.ఎందుకంటే చాలా రోజుల నుండి బాలకృష్ణ నాగార్జున మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో తండ్రిని కాదని కొడుకు బాలకృష్ణ షో కి వెళ్తే తండ్రికి అవమానమే. అందుకే నాగార్జున నాగచైతన్యకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇక నాగార్జున వార్నింగ్ తో నాగచైతన్య తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: