మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు.. ఈ సినిమా అని చూసిన ఇప్పటికే చాలామంది మూవీ లవర్ సోషల్ మీడియా వేదికగా పలు రకాల రివ్యూలను తెలియజేశారు.. ఎప్పటిలాగే అజిత్ నటన అయితే అదిరిపోయింది అని ఫస్ట్ ఆఫ్ ఆసక్తికరంగా ఉందంటూ ఒక నెటిజన్ ట్విట్ చేయగా ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని యాక్షన్ సన్నీ వేషాలు హైలైట్ గా ఉంటున్నాయంటూ తెలుపుతున్నారు.
అలాగే హీరో అజిత్, అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని త్రిష ,అజిత్ మధ్య లవ్ స్టోరీ కూడా సూపర్ గా ఉందని ఇలాంటి యాంగిల్ లో నటించడం కొత్తగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంత మేరకు మెప్పించింది తప్ప ఆకట్టుకోలేదని ఓవరాల్ గా అయితే ఈ సినిమా అజిత్ కోసం చూడవచ్చు అంటూ ట్విట్టర్ వేదికగా పలువురు నేటిజెన్సు తెలియజేస్తున్నారు.సినిమా మొదలైన 20 నిమిషాలకే స్లో పేజ్ స్టార్ట్ అవుతుందని తెలియజేస్తున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ సినిమా రీమేక్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కలెక్షన్స్ విషయంలో ఏ విధంగా సాధిస్తుందో చూడాలి.