![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjunf30e1114-d34b-4fb7-a706-954adc017fae-415x250.jpg)
రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది . దీని కారణంగా అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో కూడా ఉండొచ్చాడు . కాగా ఆ బాధను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చాలా చాలా రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా ఆయన పర్సనల్ ఇమేజ్ ని కూడా డామేజ్ చేసే విధంగా కనిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు . ఆయన అంటూ సెపరేట్గా ఒక స్పోక్స్ పర్సన్ నియమించుకోబోతున్నారు.
అయితే ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరోకి స్పోక్స్ పర్సన్ లేరు. సాధారణంగా స్పోక్స్ పర్సన్ నాయకులకి పొలిటికల్ లీడర్స్ కి మాత్రమే ఉంటారు . ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే అల్లు అర్జున్ ఒక నటుడిగా స్పోక్స్ పర్సన్ తన కోసం నియమించుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ దెబ్బ ఇలానే ఉంటుందని ..సైలెంట్ గానే చుక్కలు చూపిస్తాడు అని ..ఇక అల్లు అర్జున్ కి సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలన్న ముందుగా ఆ స్పోక్స్ పర్సన్ మాత్రమే వెల్లడిస్తాడు అని కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతుంది..!