కళ్లతో సైతం అద్భుతంగా నటించేంత ప్రతిభ కొంతమందికి మాత్రమే సొంతమవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా కళ్లతో సైతం నటించి మెప్పించే టాలెంట్ సావిత్రి సొంతమని చెప్పవచ్చు. తెలుగు, తమిళ సినిమాలలో నటించడం ద్వారా సావిత్రి తన నటనతో మెప్పించడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు. గుంటూరు జిల్లాలోని చిర్రావూరు గ్రామానికి చెందిన సావిత్రికి బాల్యం నుంచి నటనపై మక్కువ ఉండేది.
 
13 సంవత్సరాల వయస్సులోనే నృత్య నాటక పోటీలలో సావిత్రి బహుమతి అందుకున్నారు. 1949లోనే ఆమెకు మొదట మూవీ ఆఫర్ వచ్చింది. అయితే ఆ సమయంలో వచ్చిన పాత్ర వయస్సుకు మించిన పాత్ర కావడంతో ఆమె ఓకే చెప్పలేకపోయారు. తన సినీ కెరీర్ లో సావిత్రి 250 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు. సౌత్ ఇండియన్ సినిమాలలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న అతికొద్ది మంది నటీమణులలో ఆమె కూడా ఒకరు.
 
ఖర్చు విషయంలో నియంత్రణ చేయకపోవడం సావిత్రికి మైనస్ అయింది. తమిళంలో సావిత్రికి నడిగర్ తిలకం అనే బిరుదు ఇచ్చారు. చిన్నారి పాపలు అనే మూవీకి సావిత్రి దర్శకత్వం వహించగా ఈ సినిమా అప్పట్లోనే పూర్తిస్థాయిలో మహిళలు తెరకెక్కించిన సినిమా కావడం గమనార్హం. జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె లైఫ్ లో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి.
 
1981 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీన సావిత్రి మరణించగా ఆమె మరణం సినీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అభినయ ప్రధాన పాత్రలలో అలవోకగా నటించి తన అద్భుతమైన నటనతో ఆమె మెప్పించారు. సావిత్రిలాంటి మహానటి టాలీవుడ్ ఇండస్ట్రీకి మరొకరు దొరకడం కష్టమేనని చెప్పవచ్చు. సావిత్రి మరణించి 44 సంవత్సరాలు అవుతున్నా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో ఆమె నిలిచిపోయారనే చెప్పాలి. సావిత్రి తన సినీ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: