కొంత కాలం క్రితం తేజ సజ్జ హీరోగా ఆనంది హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 2021 వ సంవత్సరం ఫిబ్రవరి 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీ విడుదల సమయంలో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఎన్ని కోట్ల లాభాలను అందుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.98 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.16 కోట్లు , ఉత్తరాంధ్రలో 69 లక్షలు , ఈస్ట్ లో 51 లక్షలు , వెస్ట్ లో 39 లక్షలు , గుంటూరు లో 52 లక్షలు , కృష్ణ లో 52 లక్షలు , నెల్లూరు లో 33 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.10 కోట్ల షేర్ ... 10.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని ఈ మూవీ కి 22 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సీస్ లో 33 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 6.65 కోట్ల షేర్ ... 12 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ సినిమా 4.5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా , ఈ మూవీ 6.65 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టడంతో ఈ మూవీ 1.65 కోట్ల లాభాలను అందుకొని మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: