మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ "చిరుత" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మగధీర మూవీ తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకొని తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు. ఇకపోతే చరణ్ "మగధీర" లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించాడు.

ఇకపోతే నాగబాబు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ... హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. హరిస్ జయరాజ్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఇప్పటికీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత చరణ్ నటించిన మూవీ కావడం , ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే ఈ సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుని అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సారి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: