మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తండ్రి పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా అంజలి నటించగా ... కొడుకు పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా కియార అద్వానీ నటించింది. ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలలో నటించారు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేశారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమాతో పాటు డాకు మహారాజు , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విడుదలయ్యాయి. డాకు మహారాజ్ మూవీ జనవరి 12 వ తేదీన విడుదల కాగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ సినిమానే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇకపోతే గేమ్ చేంజర్ సినిమాని ఫిబ్రవరి 7 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ సంస్థ వారు ప్రకటించారు. ఈ మూవీ తర్వాత తక్కువ కాలానికి విడుదల అయిన డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఓ టీ టీ విడుదల తేదీలు మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు. దానితో అందరికన్నా ముందు గేమ్ చేంజర్ మూవీ ఓ టి టి లోకి వస్తున్నందుకు మెగా ఫాన్స్ కాస్త ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: