కొంత మంది బ్యూటీలకు ఎన్నో సినిమాల్లో నటించిన ఎంత మంది హీరోలతో ఆడి పాడిన రాని విజయాలు , క్రేజ్ కొంత మంది సినిమాల ద్వారా వస్తూ ఉంటుంది. వారితో నటించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా ఒక హీరోతో నటించిన సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకొని మామూలు స్థాయి నుండి అద్భుతమైన స్థాయికి చేరుకున్న హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ బ్యూటీ మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ ఫ్లాప్ కావడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు తెలుగులో వచ్చింది. కానీ ఆ తర్వాత నుండి ఈమెకు ఏ సినిమా ద్వారా కూడా కనీస విజయాలు కూడా దక్కలేదు. అలా చాలా "లో" లో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈమెకు కెరియర్లో ఈ సినిమా ద్వారానే మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. దానితో ఈమెకు క్రేజ్ కూడా తెలుగులో భారీగా పెరిగింది. ఇకపోతే కొంత కాలం క్రితం బాలయ్య హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమాలో ఈమె నటించింది.

సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ప్రగ్యా జైస్వాల్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరోలతో ఆడి పాడిన రాని క్రేజ్ బాలయ్య సినిమాల ద్వారా ఈమెకు వచ్చింది అనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అఖండ 2 మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: