టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో చాలా సంప్రదాయ బద్ధంగా... చీరకట్టు, బొట్టు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా... ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో.. ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లు ఎక్కువైపోయారు. అప్పట్లో.. ఎక్స్పోజింగ్ చేయకుండా హీరోయిన్లు మంచి అవకాశాలను దక్కించుకున్నారు. సక్సెస్ అందుకున్నారు. అలాంటి హీరోయిన్లలో సౌందర్య ఒకరు.

 

టాలీవుడ్ దివంగత హీరోయిన్ సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె గనక ఇప్పటికీ బతికి ఉంటే... ఇండస్ట్రీని దున్నేసేదని చెప్పవచ్చు. అంతలా పాపులారిని తెచ్చుకుంది. తన కెరీర్ టాప్ పొజిషన్లోకి వెళ్లిన సమయంలోనే... అర్ధాంతరంగా మరణించింది సౌందర్య. 1976 సంవత్సరంలో జన్మించిన సౌందర్య 2004 సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అంటే ఆమె కేవలం... 30 సంవత్సరాల వయసు లోపల మరణించారు.

 

మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టిన హీరోయిన్ సౌందర్య... తెలుగులో రైతు భారతం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత.... అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అమ్మోరు, హలో బ్రదర్, రాజా, అన్నయ్య, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, జయం మనదేరా, శ్వేత నాగు, దేవిపుత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు చేశారు హీరోయిన్ సౌందర్య.

 

అయితే ఈ సినిమాలలో... ఎక్స్పోజింగ్ కంటే తన నటన నమ్ముకుని సక్సెస్ అయ్యారు హీరోయిన్ సౌందర్య. ప్రతి సినిమాలో చీరకట్టు, బొట్టు కాన్సెప్ట్ నమ్ముకుని... ఇండస్ట్రీని దున్నేశారు సౌందర్య. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు కూడా... సౌందర్యను ఆదరించడం జరిగింది. ఆమె ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చేతినిండా సినిమాలు చేయగలిగారు. అయితే ఆమె చివరి సినిమా శివ శంకర్. ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా చేయగా... ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె మరణించారు. ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న తరునంలో సౌందర్య మరణించారని చెబుతూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: