తెలుగు సినిమా పరిశ్రమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు మన సినిమాలకు వంద కోట్ల కలెక్షన్లు వస్తే చాలు అనుకున్నాం. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలు నటించిన సినిమాలకు వంద కోట్ల కలెక్షన్లు ఒక్క రోజులోనే వస్తున్నాయి. ఇప్పటికే మన తెలుగు సినిమాలు ఎన్నో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పటికే అంచలంచలుగా పెరిగింది. ఇంకా ఎదుగుతూనే ఉంది.

ఇంత గొప్ప ఖ్యాతి కలిగిన తెలుగు సినిమా పరిశ్రమ లో మొదటి సినిమా విడుదల అయ్యి నేటితో 93 సంవత్సరాలు అవుతుంది. తెలుగు లో మొదట వచ్చిన పూర్తి నిడివి చలన చిత్రం భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1932 వ సంవత్సరం ఫిబ్రవరి 6 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 93 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక భక్త ప్రహ్లాద సినిమాతో మొదలైన తెలుగు సినిమా పరిశ్రమ ఈ 93 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. మన తెలుగు నుండి ఏదైనా సినిమా వస్తుంది అంటే దాని వైపు ప్రపంచం మొత్తం చూసేలా ఈ 93 సంవత్సరాల్లో తెలుగు సినిమా పరిశ్రమ ప్రయాణం సాగింది.

ఇప్పటికే మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతమైన స్థాయిలో విజయాలను అందుకున్నాయి. మన తెలుగు సినిమాలకు ఈ 93 సంవత్సరాల లో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు కూడా వచ్చాయి. అలాగే మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది నటీ నటులు , టెక్నీషియన్స్ , నిర్మాతలు గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. ఇలా ఈ 93 సంవత్సరాల లో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి ఎంతగానో పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: