ప్రస్తుతం టాలీవుడ్లో ఒకే ఒక్క సినిమా గురించి చర్చ నడుస్తోంది. అదే... నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్‌' సినిమా. ఈ సినిమా రేపు (పిబ్రవరి 7) ప్రపంచ వ్యాప్తంగా రిలీజుకి సిద్ధమైంది. అవును, మరికొద్ది గంటల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాతో.. చైతన్య సూపర్ డూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఆ దిశగానే ఈ సినిమాకోసం చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బాస్టర్ అవుతుందో... ఫలితం మరోలా మారి చైతన్య జీవితంలో పెద్దగా మార్పు లేకుండా చేస్తుందో చూడాలి మరి!

ఇక సినిమా రిలీజ్ కాబోతుండగా అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రియల్ మత్స్యకారుడి కథ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో మంచి హైప్‌ ఉంది. అంత బానే ఉన్నా.. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఓ అప్డేట్ ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది. చైతు, సాయి పల్లవి ఇద్దరు క్లైమాక్స్ లో చనిపోతారంటూ ఓ వార్త హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇది నిజమా లేక సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ఆకతాయిలు క్రియేట్ చేసిన గాసిప్ ఏమో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఆడియన్స్‌లో ఒకింత ఆసక్తి నెలకొంది. హీరో, హీరోయిన్ ఇద్దరు చివరిలో చనిపోతే సినిమా ఎలా ఉంటుందో? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో నిజంగానే వీరిద్దరూ చనిపోతారా లేదా అనేది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే!

ఇకపోతే, నాగ చైతన్యకు ఉన్న మార్కెట్ రిత్యా.. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ భారీగానే పెట్టడం జరిగింది. కానీ.. సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో గీత ఆర్ట్స్ అధినేత‌ అల్లు అరవింద్‌తో పాటు బన్నీ వాసు ఈ సినిమా కోసం చాలా భారీగా ఖర్చు చేశారు. ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో అని కొంతమందికి లోలోపల భయం ఉండనే ఉంది. అయితే ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాతో చైతు భారీ సక్సెస్ సాధిస్తాడని అభిమానులు అయితే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై టీం మొత్తం.. ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: