సినిమా షూటింగ్ కాకముందే భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న సినిమాలలో మహేష్ , రాజమౌళి కాంబో మూవీ ప్రధమ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన చాలు అది నిమిషాల్లో వైరల్ గా మారిపోతూ వస్తుంది.


మూవీ లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు , మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు , అలాగే ఓ హాలీవుడ్ బ్యూటీ కూడా ఈ మూవీ లో కీలకమైన పాత్రలో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ మహేష్ సినిమా కోసం రాజమౌళి కొత్త స్ట్రాటజీని ఫాలో కాబోతున్నట్లు కానీ దాని వల్ల మహేష్ అభిమానులు ఓ వైపు ఆనందంగా ఉన్న మరో వైపు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి , మహేష్ తో రూపొందించబోయే సినిమాను మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని భావిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.


రాజమౌళి ఇప్పటికే ప్రభాస్ తో బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తీసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ సినిమాలను రూపొందించడానికి రాజమౌళి ఐదు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడు. ఇక మహేష్ సినిమాను మూడు భాగాలుగా రూపొందిస్తే ఇంకెన్ని సంవత్సరాలను తీసుకుంటాడా అని మహేష్ అభిమానులు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాజమౌళి మూడు భాగాలతో సినిమాని రూపొందించిన ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తాడు అనే ఆనందాన్ని కూడా మహేష్ అభిమానులు వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: