డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేశారని త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ ను దృష్టిలో పెట్టుకొని బడనిర్మాణ సంస్థ చేయడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా సంగీతంతో పాటు ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ పాయల్ కూడా క్రేజ్ అందుకున్నది. కానీ మంగళవారం 2 లో పాయల్ హీరోయిన్ కాదనే విషయం అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు.
మంగళవారం 2లో ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ హీరోయిన్ పైన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నదట. ఇలాంటి సమయంలోనే అందుకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతూ ఉన్నది. ఒక లీడ్ రోల్ లో హీరోయిన్ శ్రీలీల నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికి కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో కలిసి ఒక సినిమాలో నటించింది. అలాగే రవితేజ తో ఒక సినిమా నటించగా ఈ సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి.