- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దర్శకత్వం వహించిన మొట్ట మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలుపెట్టి మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేసి అక్కడ సక్సెస్ను సాధించాడు. కొంతకాలం క్రితం యానిమల్ అనే మూవీ ని రూపొందించి ఆ మూవీతో కూడా బ్లాక్ బాస్టర్ను సొంతం చేసుకున్నాడు. ఈ మూడు మూవీలతో ఈయన ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి అంటే గొప్ప అభిమానం. ఆయన అనేక సందర్భాలలో ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు.


ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మాస్టర్ మూవీలో ఒక సన్నివేశంలో ఆయన సిగరెట్ తాగుతూ అదిరిపోయే రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఆ సినిమాలో ఆ సన్నివేశం చూసినప్పుడు నాకు అద్భుతంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే తాజాగా సందీప్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అందులో చిరంజీవి ఫోటో ప్రధానంగా ఫోకస్ అవుతుంది. దానితో సందీప్ కి చిరంజీవి అంటే ఎంత అభిమానం అనేది మరోసారి క్లియర్ గా అర్థం అయింది. ఇక చిరు , సందీప్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం సందీప్ , ప్రభాస్ హీరోగా రూపొందబోయే స్పిరిట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చిరు కోసం ఒక అద్భుతమైన క్యారెక్టర్ ను సందీప్ డిజైన్ చేసినట్లు , ఆ విషయం గురించి చిరుని సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజంగానే ప్రభాస్ హీరోగా సందీప్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చిరు నటించినట్లయితే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ కావడం ఖాయం అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: