టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కి ఈమధ్య కాలం అసలు కలిసి రావటం లేదు .. ఆయన నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అవుతూ వస్తున్నాయి .. ప్రస్తుతం ఆయన ఆశ‌లన్నీ రాబిన్‌వుడ్ , తమ్ముడు సినిమాలపైనే పెట్టుకున్నాడు .. అయితే రాబిన్‌వుడ్ మూవీ ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంది .. అలాగే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు .. గత డిసెంబర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది .. కానీ వాయిదా పడింది అప్పటినుంచి ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు ..


ఇక ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తుంది .. అయితే ఏప్రిల్ అంటే మార్చి నుంచి సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టాలి .. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అసలు ఈ సినిమా అనేది ఒకటి ఉంది అనేది కూడా గుర్తు చేయడానికి ఫిబ్రవరిలో ఓ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈనెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఓ లవ్ సాంగ్ ను రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ .. ఇక తర్వాత మార్చి నుంచి ప్రతివారం ఒక అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు .. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది.


ట్రైలర్ , పాటలు మాత్రమే బాకీ ఉన్నాయి .. ఇక మార్చిలో ప్రమోషన్లు గట్టిగా ప్లాన్ చేస్తే తప్ప సినిమాపై బజ్‌ వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు .. ఇక టీజర్ కి వచ్చిన  సినిమాపై పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది .. ఇక ఇప్పుడు కనీసం వచ్చే ట్రైలర్ అయిన గట్టిగా ప్లాన్ చేసి వదలాలి .. ఇక మరో పక్క తమ్ముడు పరిస్థితి కూడా ఇలానే ఉంది .. రాబిన్‌వుడ్ వచ్చి వెళ్ళిపోతే తప్ప తమ్ముడు ప్రమోషన్లను మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు .. తమ్ముడు టీం కూడా రాబిన్‌వుడ్ కోసమే ఎదురుచూస్తుంది .. ఈ రెండు సినిమాలు తోనే నితిన్ కెరియర్ ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: