
కేరళలోని కోళిక్కోడ్ కు చెందిన పార్వతి 2006లో మలయాళ చిత్రం "ఔట్ ఆఫ్ సిలబస్" సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. మోలీవుడ్ ఆమె నాటికి ఫిదా అయిపోయింది. ముఖ్యంగా అక్కడి యువత పార్వతి నటన అంటే పడిచస్తారు. సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఆమె కొన్ని వివాదాలతో కూడా జనాలను అలరిస్తూ ఉంటారు. 36 ఏళ్ల వయస్సు కలిగిన పార్వతి లవ్ రిలేషన్ షిప్ లో సరిగ్గా ఇమడలేకపోయింది. తాజాగా ఓ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
పార్వతి ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. “ఒకప్పుడు నేను ఒక వ్యక్తితో డేటింగ్ చేశాను. ఆయన చాలా మంచివాడు. అద్భుతమైన వ్యక్తి కూడా. అయితే నాకు విపరీతమైన కోపం ఆయన తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైనా ఆకలి ఎక్కువ అయినప్పుడు ఆ ఆకలికి తట్టుకోలేక చాలా సందర్భాలలో కోప్పడ్డాను. దానివల్లే మా బంధం కొనసాగలేకపోయింది. అలా మేమిద్దరం విడిపోయాము. అయితే అనుకోకుండా నేను ఆయనను కలిసి క్షమాపణలు కూడా చెప్పాను. కానీ ఆయనతో బంధం బ్రేకప్, అన్నీ కూడా నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది." అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఈ వ్యాఖ్యలు విన్న నెటిజనం ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆమె మూడేళ్ల నుంచి సింగల్ గానే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.