- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన బాలకృష్ణ ఎన్నో విజయాలను అందుకొని నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన స్థాయిని ఏర్పరచుకున్నాడు. ఇక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే మూడు సార్లు విజయాన్ని అందుకొని రాజకీయ నాయకుడిగా కూడా అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంతో గొప్ప నటుడిగా , రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న బాలకృష్ణ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం మన అందరికీ తెలిసిందే.


ఇకపోతే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో చంద్రబాబు నాయుడు తన ఫార్మ్ హౌస్ లో కొంత మంది అతిధులకు పార్టీ కూడా ఇచ్చారు. ఈ పార్టీలో భాగంగా బాలకృష్ణకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పండి అని కొంత మంది సూచించగా అక్కడ ఉన్న వారు అనేక విషయాలను చెప్పుకొచ్చారు. అందులో భాగంగా బాలకృష్ణ పెద్ద కుమార్తె అయినటువంటి బ్రాహ్మణి మాట్లాడుతూ ... చిన్నతనంలో నేను , తేజు , మా సోదరి ముగ్గురము నాన్న గారిని అపార్థం చేసుకునే వాళ్ళం. ఆయన ఏది మనసులో ఉంటే అదే చెప్పేవారు  అప్పుడు మాకు ఆ విషయం కాస్త కోపం తెప్పించేది.


కానీ మేము పెద్దయ్యాక ఆయనలా ఉండడం ఎంత ముఖ్యం అనేది అర్థం అయింది అని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చింది. ఇక ఈ పార్టీలో భాగంగా బాలకృష్ణ చిన్న కుమార్తె మాట్లాడుతూ ... నాన్న గారి కెరియర్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరగడానికి నేనే కారణం అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. బాలకృష్ణ గురించి తన చిన్న కుమార్తె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: