ఏంటి కమల్ హాసన్ పై 66 ఏళ్ల హీరోయిన్ ప్రేమ పెంచుకుందా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. 7 పదుల వయసు దాటిన కమల్ హాసన్ ని ప్రేమించడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కమల్ హాసన్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుండి హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఈయన కి సినిమాలతో పాటు ఎఫైర్లు కూడా ఎక్కువే.. 7పదుల వయసులో ఉన్న కమల్ హాసన్ ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో డేటింగ్ చేశారు.అలా ఈయనతో డేటింగ్ వార్తలు వినిపించిన హీరోయిన్లలో శ్రీవిద్య, గౌతమి, పూజ కుమార్, శ్రీదేవి, సిమ్రాన్ వంటి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఈ హీరోయిన్ మాత్రమే కాదు అప్పట్లో సీనియర్ నటి జయసుధ తో కూడా కమల్ హాసన్ కి డేటింగ్ వార్తలు వినిపించాయి.

అయితే ఓ ఇంటర్వ్యూలో జయసుధ పాల్గొన్న సమయంలో ఆమెకు కమల్ హాసన్ గురించి ప్రశ్న ఎదురయింది.మీరు కమల్ హాసన్ ఇద్దరు ప్రేమించుకున్నారట కదా.. నిజమేనా.. ఇద్దరు పెళ్లెందుకు చేసుకోలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విసిగిపోయిన జయసుధ నేను ఎక్కడికి వెళ్లినా కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ మీరు అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అయితే లేదు.మేము ప్రేమించుకుందాం అంటూ వచ్చిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. ఇవి కేవలం రూమర్లు మాత్రమే. అయితే ఈ వార్తలు రావడానికి కారణం మా ఇద్దరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడమే.

ముఖ్యంగా బాలచందర్ గారి సినిమాలంటే కమల్ హాసన్ నేను కచ్చితంగా ఉండేవాళ్ళం. అంతే కాదు ఇద్దరం స్టేజి మీద పాటలు కూడా పాడేవాళ్ళం. అలా మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండటంతో మేమిద్దరం ప్రేమించుకున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ అలాంటి రిలేషన్ మా మధ్యలో లేదు.అలాగే మా ఇద్దరి కాంబోలో వచ్చిన ఏ సినిమా అయినా సరే హిట్ అయ్యేది. అలాగే ఆ సినిమాలో మా జోడి బాగుండడంతో చాలామంది మాకు ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే ఈ వార్తలు వచ్చాయి అంటూ జయసుధ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: