టాలీవుడ్ లో వచ్చే కొన్ని సినిమాలకు సినిమా మొత్తం బాగోకపోయినా క్లైమాక్స్ బాగుంటే ఆ సినిమాలు మంచి హిట్ అవుతున్నాయి .. క్లైమాక్స్ బాగుంటే  హిట్ అయిన సినిమాలు కూడా మన టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి .. అలాగే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా అంతా కూడా ఓకే ఎత్తు క్లైమాక్స్ మరో ఎత్తు .. ఈ క్లైమాక్స్ వల్ల సినిమా రేంజ్ మరో రేంజ్ కి వెళ్ళింది .. అలాగే ఉప్పెన సినిమాను కూడా అదే విధంగా తన గురువు సుకుమార్ అడుగుజాడల్లో వెళ్లిన బుచ్చిబాబు ఉప్పెన‌ క్లైమాక్స్ని చరిత్రలో గుర్తుండిపోయేలాగా తెరకెక్కించాడు ..


 ఒక విధంగా చెప్పాలంటే క్లైమాక్స్ ఆ సినిమాకు ఆయువు పొట్టు .. ఇక ఎప్పుడూ రామ్‌చరణ్ తో ఓ భారీ సినిమాను చేస్తున్నాడు బుచ్చిబాబు .. మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న  ఈ సినిమా భారీ హంగులతో రాబోతుంది.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది , ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు .. ఇక ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఇప్పటివరకు ఎవరూ చూడని నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రాసుకున్నారు అట దర్శకుడు బుచ్చిబాబు . అలాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలాకాలం ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని .. మళ్లీ మళ్లీ ఈ సినిమా క్లైమాక్స్ థియేటర్లకు ర‌ప్పిస్తుంద‌న్న‌ది ఇన్సైడ్ వర్గాల టాక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ పెద్ది అనే టైటిల్ను ఇప్పటికే ఈ సినిమాకు కన్ఫర్మ్ చేస్తున్నారని తెలుస్తుంది ..


అయితే ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటున్నారు .. పాన్ ఇండియా సినిమా కాబట్టి అందరికీ అర్థమయ్యే భారీ టైటిల్ కావాలి అందుకోసం సినిమా యూనిట్ మంచి టైటిల్ కోసం అన్వేషిస్తుంది .. సుకుమార్ సినిమాల్లో హీరోకి ఏదో వీక్నెస్ ఉంటుంది .  రంగస్థలం సినిమాలో చరణ్ కు సరిగ్గా వినబడదు .. అది ఆ కథకు బాగా ఉపయోగపడింది .. ఇప్పుడు పెద్దిలో కూడా హీరోకి ఏదో లోపం ఉంటుందని దానితో సాగే డ్రామా స్టోరీని మరో లెవల్లో తీసుకువెళుతుందని అంటున్నారు .. టెక్నికల్గా ఈ సినిమాని కూడా చాలా పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నారు .. అలాగే ఈ సినిమాలో పలు స్పెషల్ అపీరియన్స్ కూడా ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: